Home
National
Iaf On Monday Scrambled Its Two Rafale Fighter Jets To Investigate The Unusual Sighting Of Mysterious Ufo
UFO: ఇంపాల్‌లో ఆదివారం యూఎఫ్‌వో కనిపించింది. ఆ చిన్న వస్తువు ఏంటో తెలియక ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలు నిలిపివేశారు. యూఎఫ్‌వో ఏంటో తెలుసుకునేందుకు రఫేల్ యుద్ధవిమానాలను రంగంలోకి దించారు. కానీ ఆ వస్తువు ఏంటో గుర్తించలేకపోయారు.
ఇంపాల్:మణిపూర్‌లోని ఇంపాల్ విమానాశ్రయం వద్ద ఆదివారం గుర్తు తెలియని వస్తువు కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్టు సమీపంలో యూఎఫ్‌వో(UFO)లు కనిపించినట్లు తెలుస్తోంది. అయితే ఆ యూఎఫ్‌వోలు ఏంటో తెలుసుకునేందుకు తక్షణమే భారతీయ వైమానిక దళం రంగంలోకి దిగింది. రెండు రఫేల్ యుద్ధ విమానాలను అక్కడకు పంపినట్లు తెలుస్తోంది. యూఎఫ్‌వో ఆనవాళ్లను పసికట్టేందుకు రఫేల్స్ రంగప్రవేశం చేశాయి. కానీ ఆ యూఎఫ్‌వో ఏంటో అంతు చిక్కలేదు.
ఆదివారం మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో యూఎఫ్‌వో కనిపించింది. దీంతో ఆ ప్రాంతంలో అనేక కమర్షియల్ విమానాలకు అంతరాయం ఏర్పడింది. ఆ యూఎఫ్‌వోను గుర్తించేందుకు వెంటనే హసిమరా ఎయిర్ బేస్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలను మోహరించారు. కొంచం సేపటి తొలి రఫేల్ తిరిగి గ్రౌండ్‌కు వచ్చేసింది. కానీ రెండవ రఫేల్‌ను మాత్రం చాలా సేపు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టించారు.
యూఎఫ్‌వో ఘటనపై ఈస్ట్రన్ కమాండ్ ఓ ప్రకటన చేసింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు ఐఏఎఫ్ ఈస్ట్రన్ కమాండ్ పేర్కొన్నది. ఇంపాల్ ఎయిర్‌పోర్టు నుంచి కనిపించిన విజువల్స్ ఆధారంగా రఫేల్స్‌ను పంపామని, కానీ ఆ చిన్న వస్తువు మళ్లీ కనిపించలేదని ఐఏఎఫ్ తెలిపింది. సాయంత్రం 4 గంటల తర్వాత పశ్చిమం వైపున ఆ యూఎఫ్‌వో కదిలి వెళ్లినట్లు స్థానిక జప్రజలు తెలిపారు.
యూఎఫ్‌వో వల్ల బిర్ తికేంద్రజిత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Más historias