మణిపూర్‌లో గుర్తు తెలియని వస్తువులు కనిపించిన ఘటన కలకలం రేపింది. దీంతో ఇంఫాల్ ఎయిర్‌పోర్టు సేవలు నాలుగు గంటలపాటు నిలిపేశారు. మూడు విమానాల ప్రయాణాలను వాయిదా వేశారు. మరో రెండు విమానాలను డైవర్ట్ చేశారు.

First Published Nov 19, 2023, 9:01 PM IST
న్యూఢిల్లీ: మణిపూర్‌లో యూఎఫ్‌వో (Unidentified Flying Object) కనిపించిందా? ఆకాశంలో గుర్తు తెలియని వస్తువు కనిపించిందని చెబుతున్నారు. దీంతో ఇంఫాల్ ఎయిర్‌పోర్టు అధికారులు అలర్ట్ అయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆపరేషన్స్ నిలిపేశారు. రెండు ఫ్లైట్‌లను డైవర్ట్ చేశారు. మరో మూడు విమానాలను డిలే చేశారు.
బిర్ తికేంద్రజిత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది. నాలుగు గంటలపాటు ఈ ఎయిర్‌పోర్టును ఆదివారం మధ్యాహ్నం షట్ డౌన్ చేశారు. ఈ గుర్తు తెలియని వస్తువును సీఐఎస్ఎఫ్ అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు చూశారు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఆపరేషన్స్ నిలిపేశారు. మూడు విమానాల డిపార్చర్‌ను వాయిదా వేశారు. సుమారు 500 ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకే పరిమితం అయ్యారు.
ఇంఫాల్ నుంచి అగర్తలాకు, గువహతి, కోల్‌కతాకు సుమారు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విమానాలు బయల్దేరి వెళ్లిపోవాల్సింది. కానీ, 6 గంటల వరకు వాటిని నిలిపేశారు. కాగా, ఢిల్లీ నుంచి ఇంఫాల్‌కు రావాల్సిన ఓ ఫ్లైట్‌ను కోల్‌కతాకు డైవర్ట్ చేశారు. గువహతి నుంచి ఇంఫాల్‌కు రావాల్సిన మరో ఫ్లైట్‌ను సాయంత్రం 6.50 గంటల వరకు సస్పెండ్ చేశారు.
Also Read: Final Match: నా పేరు జాన్సన్.. క్రీజులోకి దూసుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరు?.. పాలస్తీనాతో ఏం సంబంధం?
అయితే.. ఆ గుర్తు తెలియని వస్తువు ఏమిటనేది ఇప్పటికీ తెలియదు. అయితే, డీజీసీఏ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కలిసి ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్టు సమాచారం. అయితే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్లీ ఎయిర్‌పోర్టు ఆపరేషన్లు పునరుద్ధరించారు.
ఆకాశంలో గుర్తు తెలియని వస్తువు కనిపించినట్టు ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ చిపెమ్మి కిషింగ్ ధ్రువీకరించారు. అయితే.. సెక్యూరిటీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఆపిన మూడు విమానాలు వెళ్లిపోయాయని తెలిపారు.
Last Updated Nov 19, 2023, 9:03 PM IST
Más historias